పేదలకు ఉచిత సౌరవిద్యుత్ ఇచ్చేందుకు ముందుకు రావాలి
ABN , Publish Date - Feb 09 , 2024 | 03:57 AM
రాష్ట్రంలో పేద వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ధరకు సౌరవిద్యుత్‌ను అందించే సంస్థలు ముందుకు రావాలని, ఆ దిశగా అమెరికాలో ఏమైనా సంస్థలు పనిచేస్తుంటే సమాచారం అందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. సచివాలయంలో గురువారం
ఆ తరహా సంస్థలు ఉంటే సమాచారం అందజేయండి
అమెరికా సంస్థ ప్రతినిధులతో ఉపముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేద వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ధరకు సౌరవిద్యుత్‌ను అందించే సంస్థలు ముందుకు రావాలని, ఆ దిశగా అమెరికాలో ఏమైనా సంస్థలు పనిచేస్తుంటే సమాచారం అందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. సచివాలయంలో గురువారం అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ స్ట్రాటజీస్ సంస్థ ప్రతినిధులతో వారు భేటీ అయ్యారు. భారత్‌లోని అనేక రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ రిచర్డ్ రూసో నివేదించారు. కాలానుగుణంగా చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా, టెక్నాలజీని డిస్కమ్‌లు అన్వయం చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. తెలంగాణతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. కాగా పేద వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ వ్యయంతో సోలార్‌విద్యుత్‌ను అందించే సంస్థలు ఉంటే ఆ వివరాలను తమకు అందజేయాలని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కోరారు. విద్యుత్ రంగంలో ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందించే సంస్థల సమాచారం ఇవ్వాలని వారు కోరారు.