Share News

ప్లాస్టిక్‌ నియంత్రణకు సహకరించాలి : బీఎల్‌ఆర్‌

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:02 AM

ప్లాస్టిక్‌ నియంత్రణకు అందరి సహకారం అవసరమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

 ప్లాస్టిక్‌ నియంత్రణకు సహకరించాలి : బీఎల్‌ఆర్‌
ప్లాస్టిక్‌ వ్యాపారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ప్లాస్టిక్‌ నియంత్రణకు సహకరించాలి : బీఎల్‌ఆర్‌

మిర్యాలగూడ, జూలై 26: ప్లాస్టిక్‌ నియంత్రణకు అందరి సహకారం అవసరమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పాతమార్కెట్‌లో శుక్రవారం ప్లాస్టిక్‌ ఉత్పత్తిదారులు, వ్యాపారుల తో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ‘నేను - నా మిర్యాలగూడ’ నినాదంతో ఆగస్టు 15వ తేదీ వ రకు పట్టణాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిషేధించిన ప్లాస్టిక్‌ను విక్రయించవద్దని, ప్ర జలు వినియోగించరాదన్నారు. ఆయన వెంట మునిసిసల్‌ కమిషనర్‌ యూసుఫ్‌ ఉన్నారు.

ఫ కార్పోరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చే స్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్ర భుత్వ బాలకోన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంతరెడ్డి పాఠశాలకు లక్ష రూపాయలు కేటాయించారని, ఆ నిధులను కలెక్టర్‌ పర్యవేక్షణలో ఖర్చు చేసి నియోజకవర్గంలోని ప్రతీ పాఠశాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధానంగా బాలకల విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచఎం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:02 AM