పెండింగ్ డబ్బులు చెల్లిస్తేనే సర్వే కొనసాగిస్తాం
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:33 PM
పెండింగ్‌లో ఉన్న పల్స్ పోలి యో సర్వే డబ్బులను చెల్లిస్తేనే ప్రభుత్వం చేప ట్టిన లెప్రసీ సర్వే కొనసాగిస్తామని ఆశా వర్క ర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కళావతి ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
- ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కళావతి
- సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నాగర్‌కర్నూల్ టౌన్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్‌లో ఉన్న పల్స్ పోలి యో సర్వే డబ్బులను చెల్లిస్తేనే ప్రభుత్వం చేప ట్టిన లెప్రసీ సర్వే కొనసాగిస్తామని ఆశా వర్క ర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కళావతి ప్రభుత్వానికి స్పష్టం చేశారు. బుధవారం సీఐ టీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ఆశా వర్కర్లతో లెప్రసీ స ర్వే చేయాలని ప్రభుత్వం అధి కారులకు ఆదేశించి శిక్షణలు కూడా నిర్వహించిందని పేర్కొ న్నారు. గతంలో చేసిన పల్స్ పో లియో సర్వే డబ్బులు చెల్లించిన తర్వాతే ఆశా వర్కర్లతో కొత్త సర్వే చేయించాల న్నారు. పల్స్ పోలియో సర్వే డబ్బులు ఇప్పటికే అన్ని జిల్లాలో ఇచ్చారని, ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో నేటికీ అందలే దన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడి న వినతిపత్రాన్ని జిల్లా ఉపవైద్యాధికారి వెంక టదాసుకు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, సహా య కార్యదర్శి రామయ్య, నాయకులు అశోక్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమ్మ, ఉపాధ్యక్షురాలు స్వప్న, శ్రీదేవి, వసుంధర, నర్మద, కృష్ణవేణి, భాగ్యమ్మ, వెంకటమ్మ, శకుంతల, సువర్ణ, మానస, లక్ష్మి, చంద్రకళ, మాణిక్యమ్మ, మమత, శోభ, అమీనా తదితరులు పాల్గొన్నారు.