Share News

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లో అవినీతి సహించం

ABN , Publish Date - Nov 23 , 2024 | 11:25 PM

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలలో దళారు లు అవినీతికి పాల్పడితే సహించేది లేదని రాష్ట్ర ఎక్సైజ్‌ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లో అవినీతి సహించం
కొల్లాపూర్‌లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- చెక్కుల పంపిణీలో ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌/ పెద్దకొత్తపల్లి, నవంబ రు 23 (ఆంధ్రజ్యోతి) : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలలో దళారు లు అవినీతికి పాల్పడితే సహించేది లేదని రాష్ట్ర ఎక్సైజ్‌ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శనివారం కొల్లాపూర్‌ తహసీ ల్దార్‌ కార్యాలయంలో ఏడు మండలాలకు చెం దిన 164 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అం దజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులనుద్దే శించి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. క ల్యాణలక్ష్మి, షాదీముబార్‌ లబ్ధిదారులను రోజు ల తరబడి కార్యాలయం చుట్టు తిప్పుకోకుం డా 15 రోజుల్లోపు వారికి చెక్కులు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రా మాలలో దళారులు కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్‌ పథకం లబ్ధిదారుల నుంచి డబ్బులు వ సూలు చేసినట్లు తన దృష్టికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చర్యలు తప్పవ న్నారు. కార్యక్రమంలో ఆర్డీవో భన్సీలాల్‌, కొల్లా పూర్‌ తహసీల్దార్‌ మురళీధర్‌రావు, కొల్లాపూర్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మేకల రమ్య, మునిసిపల్‌ కౌన్సిలర్లు, అధికారులు కాంగ్రెస్‌ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఫ కొల్లాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన 18 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్దిదారులకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు సూర్యప్ర తాప్‌గౌడ్‌, వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మేకల చంద్రయ్య, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 11:25 PM