Share News

సంక్షేమం సగమే..

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:26 AM

మత్స్యకారుల సంక్షేమానికి పాటుప డుతున్నామని పాలకులు చెబుతున్నా ఆ మేరకు ఫలితాలు కనిపించడం లేదు. జిల్లాలో చేపల పంపి ణీ అంతంత మాత్రంగానే సాగుతోంది. చెరువులు నిండుకుండల్లా ఉంటున్నా జిల్లాలో మత్స్యసంపద కరువైంది.

సంక్షేమం సగమే..

మత్స్యకారులకు అరకొర ఉపాధి

భూపాలపల్లి జిల్లాలో 50 శాతమే చేపల పంపిణీ

చెరువులు నిండుకుండల్లా ఉన్నా నెరవేరని లక్ష్యం

ఈ ఏడాది 1.16 కోట్ల పిల్లను మాత్రమే వదులుతున్న వైనం

భూపాలపల్లి కలెక్టరేట్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల సంక్షేమానికి పాటుప డుతున్నామని పాలకులు చెబుతున్నా ఆ మేరకు ఫలితాలు కనిపించడం లేదు. జిల్లాలో చేపల పంపి ణీ అంతంత మాత్రంగానే సాగుతోంది. చెరువులు నిండుకుండల్లా ఉంటున్నా జిల్లాలో మత్స్యసంపద కరువైంది. సర్కారు ఉచితంగా చేపడుతున్న చేపల పంపిణీ కుంటుపడుతోంది. లక్ష్యంలో సగం మాత్రమే నెరవే రిందని తెలుస్తోంది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని వందశాతం చేపట్టగా ప్రస్తుత సర్కారు 50 శాతానికే పరిమితమైందని లెక్కలు చెబుతున్నాయి.

జిల్లాలో 2.93 కోట్ల చేపలు పంపిణీ చేయాల్సి ఉండగా ఈ ఏడాది 1.46 కోట్లతోనే అధికారులు సరిపెడుతున్నారు. అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో నీరు నిల్వ లేకపోవడంతో 30 లక్షల చేపల పంపిణీ రద్దు చేశారు. దీంతో ఈఏడాది 1.16 కోట్ల చేపలు మాత్రమే పంపిణీ జరగనుంది. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు జలకళతో ఉట్టిపడుతు న్నాయి. 832 చెరువుల్లో దాదాపు అన్ని అలుగు పోశాయి. చెరువులు పూర్తిగా నిండినా ఇప్పటి వరకు ఉచిత చేపల పంపిణీ పూర్తిస్థాయిలో చేసింది లేదు.

టార్గెట్‌ 2.93 కోట్లు.. పంపిణీ 1.46 కోట్లే..

జిల్లాలో మొత్తం 118 మత్స్యపారిశ్రామిక సంఘా లు ఉన్నాయి. వీటిలో 9,250 మంది సభ్యులు ఉన్నారు. ప్రత్యేక్ష్యంగా, పరోక్షంగా సుమారు 40వేల మంది మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. ఈఏడాది జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లల్లో 2.93 కోట్ల చేపల పంపిణీకి అధికా రులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గత ఏడాది 2.57 కోట్ల చేపలు పంపిణీ చేస్తే ఈసారి అదనంగా మరో 35 లక్షలు చెరువుల్లో వదిలేందుకు ప్రతిపాదిం చారు. జిల్లాలోని 832 చెరువులు, కుంటలతోపాటు గణపురం, భీంఘన్‌పూర్‌, అన్నారం, మేడిగడ్డ జలాశ యాల్లో చేపల పంపిణీ చేయనున్నారు. అయితే.. ఈసారి జిల్లాకు నిర్దేశించుకున్న లక్ష్యంలో సగం మాత్రమే ప్రభుత్వం పంపిణీకి ముందుకు వచ్చింది. దీంతో 1.46కోట్ల చేపల పంపిణీ మాత్రమే జరుగు తోంది. ఇప్పటికే జిల్లాలోని పంపిణీ పూర్తయింది. జూన్‌ నుంచి ఆగస్టు వరకు జరగాల్సిన ఉచిత చేపల పంపిణీ అక్టోబరులో ప్రారంభమైంది. ఆలస్యం గా మొదలు కావడంతో పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని నెరవేరగలుగుతారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే.. అనుకున్నట్టే జరిగింది. టార్గెట్‌లో సగంతోనే మాత్రమే ప్రభుత్వం సరిపెట్టుకుంటోంది. వంద శాతం టార్గెట్‌ను పూర్తి చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నామని చెప్పిన అధికారులుఉ అంతర్గత నిర్ణయం మేరకు 50 శాతానికే పరిమితమయ్యారు. దీంతో మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. ప్రభు త్వం సగం చేపలనే పంపిణీ చేయడంతో వాటిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న కుటుంబాలు తీవ్ర నిరాశలో కురుకుపోయాయి.

- ఎదుగుదల ప్రభావం

చెరువుల్లో చేపలను అధికారులు రెండు రకాలుగా వదులుతారు. నీరు నిల్వ ఉండే సామర్థ్యాన్నిబట్టి కొన్నింటిని నిర్ధారిస్తారు. పూర్తిగా నీటితో నిండి ఉన్న చెరువుల్లో 45 రోజుల వయసున్న 35-40 మిల్లీమీటర్ల చేపలు వదులుతారు. ఏడాది మొత్తం నీరు నిల్వ ఉండే చెరువులు, రిజర్వాయర్లల్లో 75 రోజుల వయసు ఉండే 90-100మిల్లీ మీటర్ల పొడవు ఉండే చేపలను వదులుతారు. పంపిణీ చేసిన చెరువులు దాదాపు కిలో సైజు పెరగడానికి ఆరు నెలల సమయం పడుతుంది. జూన్‌, జూలైలో రిజర్వాయర్లల్లో చేపలను వదిలితే అవి డిసెంబరు నుంచి రెండు, మూడు నెలలపాటు పట్టుకొని అమ్ముకొనే వీలు ఉంటుంది. సెప్టెంబరులో చేపలు వదిలితే అవి ఫిబ్రవరి వరకు పట్టుకొనే అవకాశం ఉంటుంది. వేపవిలో ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని చేపలు చనిపోవడంతోపాటు బరువు తగ్గొచ్చు. తద్వారా ఆయా చెరువులపై ఽఆధారపడే మత్స్యకారులునష్టపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అక్టోబరులో పంపిణీ చేసిన చేపల పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

- ప్రభుత్వ ఆదేశాలనుసారమే..

అవినాష్‌, మత్స్యశాఖ జిల్లా అధికారి (భూపాలపల్లి)

జిల్లాలో చేపల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాలనుసారం పూర్తి చేస్తున్నాం. టెండర్‌ తదితర కారణాలతో అనుకున్న టార్గెట్‌లో 50శాతం చేపలనే చెరువుల్లో వదులుతున్నాం. జిల్లాల్లో 1.10 కోట్లచేపలను ఈఏడాది పంపిణీ చేస్తున్నాం.

Updated Date - Nov 15 , 2024 | 12:26 AM