బీఆర్‌ఎస్ హయాంలో జిల్లాకు ఏం మేలు చేశారు
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:02 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఏం మేలు చేశారని కేటీఆర్ వస్తున్నారని ప్రభు త్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రశ్నించారు. పట్ట ణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఏం మేలు చేశారని కేటీఆర్ వస్తున్నారని ప్రభు త్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రశ్నించారు. పట్ట ణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్య క్షుడు విద్యాసాగర్‌రావు ప్రభుత్వంపై చేసిన అసత్య ఆరోపణలను తీ వ్రంగా ఖండిస్తున్నామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పా ర్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో అమలు చేసి హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలకు ఏం చే శారో జవాబు చెప్పి కేటీఆర్ పాదయాత్ర చేపట్టాలన్నారు. రైతులకు బే డీలు వేసి తీసుకెళ్లిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం బీ ఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో త మ ఉనికిని కాపాడుకోవటానికి అసత్య ప్రచారం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ పార్టీ బూటకపు పాదయాత్ర చేసిన వారి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ సమావేశంలో టీపీ సీసీ సభ్యులు, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంగనభట్ల దినే ష్, ఏఎంసీ చైర్‌పర్సన్ చిలుముల లావణ్య-లక్ష్మణ్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, కౌన్సిలర్ జక్కు పద్మ-రవీందర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్, ఆశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.