Share News

అంజన్న భక్తుల కోసం వీల్‌ చైర్స్‌ అందజేత

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:44 AM

కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం కోసం వచ్చే దివ్యాంగుల భక్తుల సౌకర్యార్థం కరీంనగర్‌ లయన్స్‌ క్లబ్‌ దాతలు యూఎస్‌ఏలో ఉండే గూడ హర్షిత్‌రెడ్డి సహకారంతో గురువారం ఆరు వీల్‌చైర్స్‌ అందజే శారు. స్వామి వారి దర్శనం కోసం దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులు తొలగించడానికి వీల్‌చైర్స్‌ అందించినట్లు లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు తెలిపారు.

అంజన్న భక్తుల కోసం వీల్‌ చైర్స్‌ అందజేత
అధికారులకు వీల్‌ చైర్స్‌ అందిస్తున్న లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు

మల్యాల, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం కోసం వచ్చే దివ్యాంగుల భక్తుల సౌకర్యార్థం కరీంనగర్‌ లయన్స్‌ క్లబ్‌ దాతలు యూఎస్‌ఏలో ఉండే గూడ హర్షిత్‌రెడ్డి సహకారంతో గురువారం ఆరు వీల్‌చైర్స్‌ అందజే శారు. స్వామి వారి దర్శనం కోసం దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులు తొలగించడానికి వీల్‌చైర్స్‌ అందించినట్లు లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు చంద్రశేఖర్‌, ఉపప్రధానర్చకులు చిరంజీవి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంధర్‌రెడ్డి, దర్మేంధర్‌తో పాటు లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు శరత్‌కృష్ణ, గవర్నర్‌ సురేశ్‌, సెక్రటరీ శివకాంత్‌, రాంబాబు, రాజేంధర్‌, వేణు, చక్రపాణి పాల్గొన్నారు

ఫ బుల్లితెర నటుల పూజలు

కొండగట్టు ఆంజనేయస్వామిని గురువారం పలువురు బుల్లితెర నటులు దర్శించుకున్నారు. ఫిష్‌ వెంకట్‌తో పాటు పలువురు అంజన్నను దర్శించుకొని పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. వెంకట్‌లో పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది సెల్ఫీలు దిగారు.

Updated Date - Dec 27 , 2024 | 12:44 AM