ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:03 AM
భార్య ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసిన సంఘట ఇది. ఈ సంఘ టనపై నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల స మావేశంలో శుక్రవారం వివరాలను వెల్లడించా రు.
- భార్యతో పాటు మరో ఐదుగురికి రిమాండ్
నాగర్‌కర్నూల్ క్రైం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : భార్య ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసిన సంఘట ఇది. ఈ సంఘ టనపై నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల స మావేశంలో శుక్రవారం వివరాలను వెల్లడించా రు. నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రా మంలో కీర్తి, జగదీశ్ భార్యాభర్తలు. వీరు ప్రే మించుకుని 2011లో ప్రేమ వివాహం చేసుకు న్నారు. వీరికి కుమారుడు సాయిఅక్షిత్(12), కూతురు శరణ్య(9)లు ఉన్నారు. జగదీశ్ తండ్రి ఉపాధ్యాయుడిగా పని చేస్తూ మృతి చెందడంతో తండ్రి ఉద్యోగం జగదీశ్‌కు రావ డంతో బిజినేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే క్రమంలో అతని భార్య కీర్తి కల్వకుర్తికి చెందిన ఎస్‌బీఎం రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్‌మన్‌గా పని చేయడానికి వెళ్లింది. అక్కడ బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరి వివాహేతర సంబంధం ఇరు కుటుంబా ల్లో తరచూ గొడవలు జరుగుతుం డేవని డీఎస్పీ పేర్కొన్నారు. గ్రామ పెద్దల సమక్షంలో నచ్చజెప్పినా కీర్తి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎలాగై నా భర్తను అడ్డు తొలగించుకోవాల ని పథకం రచించింది. నాగర్ కర్నూ ల్‌లో నివాసం ఉంటున్న కీర్తి, జగదీష్ దంపతులు నవంబరు 24న దైవద ర్శనం పేరిట గద్వాలకు వెళ్లారు. అక్కడి నుంచి ప్రియుడు నాగరాజుతో కల్లు తెప్పించి అందు లో విషం కలిపించి భర్త జగదీశ్‌కు తాగిం చింది. స్పృహ కోల్పోయిన జగదీశ్‌ను తీసుకుని తూడుకుర్తి శివారులో గల వారి వ్యవసాయ పొలం దగ్గర కు వచ్చి కరెంటు షాక్‌తో హత్య చేయాలని పూనుకున్నారు. చివరకు అక్కడ కరెంటు లేక పోవడంతో కేఎల్‌ఐ కాల్వ దగ్గరకు తీసుకెళ్లి ప్రియుడు నాగరాజు, అతని స్నేహితులు సా యికుమార్, పద్మ, సుధాకర్, మోహన్ గౌడ్‌ల సహాయంతో కేఎల్‌ఐ కాల్వ నీటిలో పడేశారు. బిజినేపల్లి శివారులో మరు సటి రోజు శవమై కన్పించడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుని తరపున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతుని భార్య కీర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసింది తానేనని అంగీక రించింది. ఈ కేసులో కీర్తి, నాగరాజు, కీర్తి సో దరుడు సాయికుమార్, కీర్తి తల్లి పద్మ, వీరికి సహకరించిన శివ, సుధాకర్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకు సహకరించిన మరో వ్యక్తి మోహన్ గౌడ్ పరారీలో ఉన్నాడని, త్వరలో అరెస్టు చే స్తామన్నారు.కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ సీఐ కనకయ్యగౌడ్, బిజినేపల్లి ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ హత్య కేసును సీఐ కనకయ్య, బిజినేపల్లి ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా ఛేదించినందుకు అభినందించారు.