ఫూల్ మఖానా ఖీర్
ABN , Publish Date - Dec 22 , 2024 | 10:41 AM
కావలసిన పదార్థాలు: ఫూల్ మఖానా - ఒకటిన్నర కప్పు, బటర్ - 1 టీ స్పూను, క్రీమ్ మిల్క్ - 1.5 లీటర్లు, జీడిపప్పు, పిస్తా, సారపప్పు, కిస్మిస్ - అన్నీ కలిపి అరకప్పు, చక్కెర (పొడి) - ఒక కప్పు, కుంకుమపువ్వు - 20 రెమ్మలు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, నీరు - అరకప్పు.

తయారుచేసే విధానం: పాన్‌లో బటర్ వేసి మఖానా దోరగా వేగించి, తీసి పక్కనుంచాలి. అదే పాన్‌లో నీరు, పాలు మరిగించాలి. మరుగుతున్నప్పుడే కుంకుమపువ్వు కలపాలి. తర్వాత వేగించిన మఖానా వేసి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. మఖానా మెత్తబడ్డాక తరిగిన బాదం, జీడిపప్పు, సారపప్పు, పిస్తా కలపాలి. ఇప్పుడు పంచదార పొడి వేసి, కలిపి యాలకుల పొడి, కిస్మిస్ చల్లి 5 నిమిషాలు చిన్నమంటపై ఉంచి దించేయాలి. ఈ ఖీర్ వేడిగా, లేదా చల్లగా .. ఎలా తాగినా ఎంతో రుచిగా ఉంటుంది.