అమరావతిపై 45 శాతం అదనపు భారం

ABN, Publish Date - Dec 11 , 2024 | 09:33 AM

అమరావతి: వైఎస్‌ జగన్‌ నిర్వాకంతో ‘అమరావతి’పై పెను భారం పడుతోంది. రాజధాని నిర్మాణ వ్యయం ఏకంగా 45 శాతం పెరిగినట్లు అంచనా.. నాడు... శరవేగంగా, యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న రాజధాని పనులను జగన్‌ ఒక్కసారిగా ఆపివేశారు. తర్వాత మూడు ముక్కలాటతో అమరావతిని అటకెక్కించారు.

అమరావతి: వైఎస్‌ జగన్‌ నిర్వాకంతో ‘అమరావతి’పై పెను భారం పడుతోంది. రాజధాని నిర్మాణ వ్యయం ఏకంగా 45 శాతం పెరిగినట్లు అంచనా.. నాడు... శరవేగంగా, యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న రాజధాని పనులను జగన్‌ ఒక్కసారిగా ఆపివేశారు. తర్వాత మూడు ముక్కలాటతో అమరావతిని అటకెక్కించారు. ఇప్పుడు అవే పనులను పూర్తి చేయడానికి భారీగా అదనపు ఖర్చు చేయాల్సి వస్తోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు.


సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీయే 42వ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాజధాని కోసం రైతులు కేవలం 58 రోజుల్లోనే స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారు. కానీ, జగన్‌ మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేశారు. ఆయన నిర్వాకంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. రోడ్ల నిర్మాణం రేట్లు 25 నుంచి 28 శాతం పెరిగాయి. భవనాలకు సంబంధించి 35 శాతం నుంచి 55 శాతం పెరిగాయి. లే అవుట్స్‌లో గ్రావెల్‌ ధర 6 శాతం పెరుగుతుందని అంచనా. ఎస్‌వోఆర్‌ రేట్లు 29 శాతం, జీఎస్టీ 6 శాతం పెరిగింది. ఇతర నష్టాల వల్ల 1.6 శాతం భారం పడుతోంది. మొత్తంగా అన్నీ కలిపి 45 శాతం ధరలు పెరుగుతున్నాయి. ఐదేళ్లపాటు అమరావతి పనులు ఆపకుండా కొనసాగించి ఉంటే ఇంత భారం ఉండేది కాదు. అయినా... సీఎం చంద్రబాబు సూచన మేరకు మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసి తీరతాం’’ అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శిక్షణ తరగతులను బహిష్కరించిన బీఆర్ఎస్

ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం..

మోహన్ బాబు, మనోజ్, విష్ణులకు నోటీసులు

మీడియాపై మోహన్ బాబు చిందులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 11 , 2024 | 09:34 AM