వరద బాధితులకు అండగా ABN
ABN, Publish Date - Sep 05 , 2024 | 08:51 AM
అమరావతి: వరద పీడిత ప్రాంతాలకు తొలిసారిగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెళ్లింది. ఇప్పటి వరకు సహాయక బృందాలు చేరుకుని వాంబే కాలనీ శివారు ప్రాంతానికి ఏబీఎన్ టీమ్ సహాయక బృందాలతో వెళ్లింది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలను ఎలా చేస్తున్నారో ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించింది. అంతే కాదు..
అమరావతి: వరద పీడిత ప్రాంతాలకు తొలిసారిగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెళ్లింది. ఇప్పటి వరకు సహాయక బృందాలు చేరుకుని వాంబే కాలనీ శివారు ప్రాంతానికి ఏబీఎన్ టీమ్ సహాయక బృందాలతో వెళ్లింది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలను ఎలా చేస్తున్నారో ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించింది. అంతే కాదు.. హెలీకాఫ్టర్ ద్వారా జారవిడుస్తు్న్న ఆహార ప్యాకెట్లను తీసుకునేందుకు కింద బాధితులు ఎలా పోటీ పడుతున్నారు.. ప్యాకెట్లు ఎక్కడ జార విడుస్తున్నారో కూడా ఏబీఎన్ ప్రత్యక్షంగా చూపించింది.
బెజవాడ నగరం వరదలతో అతలాకుతలమైంది. విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం పరిధిలోని 16 డివిజన్లు నీట మునిగాయి. బుడమేరు నేరుగా వచ్చి ఈ డివిజన్లు అన్నింటినీ నీట ముంచింది. జలదిగ్బంధంలో చిక్కుకున్న ఈ డివిజన్లో బయటకు వచ్చేందుకు మూడు రోజులు పట్టింది. భవనాల్లో కూడా మొదటి అంతస్తుకు నీరు చేరడంతో అందరూ రెండు, మూడు అంతస్తుల్లో తలదాచుకున్నారు. మూడు రోజులపాటు నీరు, పాలు, నిత్యావసరాలు, విద్యుత్ సరఫరా లేక పిల్లులు, వృద్ధులు నరకయాతన అనుభవించారు. సమాయక బృందాలు ఆ ప్రాంతాలకు వెళ్లాలని భావించినప్పటికీ వరద ఉధృతి కారణంగా అక్కడకు చేరుకోలేకపోయాయి. దీంతో అందరూ తీవ్ర ఆగ్రహం, ఆందోళనకు గురయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ రాత్రి నుంచి కురుస్తున్న వర్షం..
బుడమేరు గండ్లు పూడిక పనులు.. పరిశీలిస్తున్న మంత్రులు..
జగన్ చేష్టలతోనే ఇంతటి విపత్తు
మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 05 , 2024 | 08:51 AM