ఫార్ములా-ఈ రేసింగ్‌పై ఏసీబీ దూకుడు..
ABN, Publish Date - Nov 07 , 2024 | 07:31 AM
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణలో దూకుడు పెంచింది. విచారణ మొదలుపెట్టిన ఏసీబీ.. ఫైళ్లు పరిశీలించి అక్రమాలు ఎలా జరిగాయన్నదానిపై దర్యాప్తు చేస్తోంది. కొద్ది రోజుల్లో కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణలో గత ప్రభుత్వంలో చేపట్టిన ఫార్ములా-ఈ రేసింగ్‌పై ఏసీబీ దూకుడు పెంచింది. మరోవైపు నేతల పంచ్‌లు కూడా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. బాంబులు పేలతాయంటూ మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా ఎవరెప్పుడు అరెస్టు అవుతారో ఆయన ఎలా చెబుతారంటూ కేటీఆర్ సెటైర్ వేశారు. తెలంగాణలో ఒకవైపు మంత్రుల మాటలు.. మరోవైపు గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై దర్యాప్తు ఆసక్తికరంగా మారుతోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణలో దూకుడు పెంచింది. విచారణ మొదలుపెట్టిన ఏసీబీ.. ఫైళ్లు పరిశీలించి అక్రమాలు ఎలా జరిగాయన్నదానిపై దర్యాప్తు చేస్తోంది. కొద్ది రోజుల్లో కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఫార్ములా-ఈ రేసింగ్‌కు సంబంధించి రూ. 55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది. మున్సిపల్ శాఖ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ఆయా విదేశీ సంస్థలు, ప్రతినిధులకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల రాచమర్యాదలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 07 , 2024 | 07:31 AM