నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు..?

ABN, Publish Date - Aug 14 , 2024 | 12:00 PM

హైదరాబాద్: టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్‌పై చర్యలు తప్పవా? అంటే అవుననే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథన్ అంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఆయన కీలక ప్రకటన చేశారు. చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన భవనాలన్నీ కూల్చేస్తామని చెప్పడంతో నాగార్జున ఎన్‌కన్వెన్షన్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

హైదరాబాద్: టాలీవుడ్ హీరో నాగార్జున (Tollywood Hero Nagarjuna)కు చెందిన ఎన్‌కన్వెన్షన్‌ ('N' Convention )పై చర్యలు తప్పవా? అంటే అవుననే హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) ఏవీ రంగనాథన్ (AV Ranganathan) అంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఆయన కీలక ప్రకటన చేశారు. చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన భవనాలన్నీ కూల్చేస్తామని చెప్పడంతో నాగార్జున ఎన్‌కన్వెన్షన్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది. కానీ సిటీ అభివృద్ధి పేరుతో నగరంలోని అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి. దీంతో 1979 నుంచి 2023 వరకు అంటే 44 ఏళ్ళలో నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది.


శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించి వాస్తవ విర్తీర్ణం.. ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు అందజేసింది. దీని ఆధారంగా కబ్జాలపై కొరడా జులిపించేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎన్‌కన్వెన్షన్‌పై చర్యలు తప్పవని తెలుస్తోంది. నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్‌పై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. హైదరాబాద్‌లో చెరువులను కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలపై పదేళ్ల క్రితమే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కొరడా జులిపించింది. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్‌కన్వెన్షన్‌ హాల్‌ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

జగనన్న లేఅవుట్లలో విజిలెన్స్ తనిఖీలు..

ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరేయాలి..

9 రాష్ట్రాల NSUI అధ్యక్షుల ప్రకటన

ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారుల తనిఖీలు..

శంషాబాద్ పీఎస్ పరిధిలో దారుణం...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 14 , 2024 | 12:00 PM