పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు..

ABN, Publish Date - Nov 15 , 2024 | 07:13 AM

రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరి పట్ల మద్రాస్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు ముమ్మాటికీ విద్వేష ప్రేరేపితమేనని తేల్చిచెప్పింది.

చెన్నై: నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. తెలుగు మూలాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన మధురై న్యాయస్థానం బెయిల్ ఇవ్వడాన్ని తిరస్కరించింది. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న కస్తూరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


కస్తూరి వ్యాఖ్యలు..

రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరి పట్ల మద్రాస్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు ముమ్మాటికీ విద్వేష ప్రేరేపితమేనని తేల్చిచెప్పింది. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడులో పలు చోట్ల కేసులు నమోదవ్వగా, ముందస్తు బెయిల్‌ కోసం కస్తూరి మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇది దేవుడు రాసిన స్ర్కిప్ట్‌

తల్లిని అవమానిస్తే సహించాలా..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 15 , 2024 | 07:13 AM