కర్నాటకలో ఏడీజీ వర్సెస్ కుమారస్వామి

ABN, Publish Date - Oct 01 , 2024 | 12:23 PM

కుమారస్వామి, ఏడీజీ చంద్రశేఖర్ మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఈ వివాదం ఏకంగా ఢిల్లీని తాకింది. 2007లో కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలో 550 ఎరాల్లో ఐరన్ ఓర్ మైనింగ్‌కు అనుమతులు ఇచ్చారు. అప్పట్లో అది అక్రమ మైనింగ్ అని తేలడంతో కుమారస్వామితో పాటు పలువురిపై కేసు నమోదైంది.

బెంగళూరు: కర్నాటకలో కేంద్ర మంత్రి వర్సెస్ ఐపీఎస్ వ్యవహారం ఇప్పుడు హీటెక్కుతోంది. లోకాయుక్త కేసులో రాజ్‌భవన్ నుంచి ప్రాసిక్యూషన్ అనుమతులు కోరడంతో కేంద్ర మంత్రి, మాజీ సీఎం కుమారస్వామి, లోకాయుక్త ఏడీజీపై సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి అధికారులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తోందని ఆరోపించారు. కుమారస్వామి కామెంట్లపై ఏడీజీ చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు.


కుమారస్వామి, ఏడీజీ చంద్రశేఖర్ మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఈ వివాదం ఏకంగా ఢిల్లీని తాకింది. 2007లో కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలో 550 ఎరాల్లో ఐరన్ ఓర్ మైనింగ్‌కు అనుమతులు ఇచ్చారు. అప్పట్లో అది అక్రమ మైనింగ్ అని తేలడంతో కుమారస్వామితో పాటు పలువురిపై కేసు నమోదైంది. ఈ కేసు లోకయుక్తకు చేరడంతో విచారణ అధికారిగా అడిషనల్ డీజీపీ చంద్రశేఖర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేసు విచారణ తుది దశకు చేరడంతో కుమారస్వామిని విచారించేందుకు లోకాయుక్త సిట్ గవర్నర్‌ను కోరింది. అయితే ఆ విషయం బయటకు రావడంతో కుమారస్వామి ఆరోపణలకు దిగారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నటుడు గోవింద ఇంట్లో గన్ మిస్ ఫైర్ ..

కూకట్‌పల్లిలో బతుకమ్మ సంబరాలు

బొబ్బిలిలో డ్రగ్స్ అవగాహన సదస్సు

విజయవాడలో 'సత్యం సుందరం’ మూవీ సక్సెస్ మీట్

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 01 , 2024 | 12:37 PM