కొడుకు కోసం తండ్రి పరుగులు..

ABN, Publish Date - Dec 13 , 2024 | 05:24 PM

సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్టు చేసేందుకు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వచ్చినప్పటి నుంచీ చంచల్ గూడ జైలుకు తరలించే వరకూ బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఆయన వెంటే పరుగులు పెట్టారు.

హైదరాబాద్: సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్టు చేసేందుకు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వచ్చినప్పటి నుంచీ చంచల్ గూడ జైలుకు తరలించే వరకూ బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఆయన వెంటే పరుగులు పెట్టారు. ముందుగా పోలీసులు అరెస్టు చేసేందుకు ఐకాన్ స్టార్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం అరెస్టు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆపై నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటికే హైకోర్టులో అల్లు అర్జున్ స్టార్ క్వాష్ పిటిషన్ వేయగా శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయినప్పటికీ నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు అల్లు అర్జున్‌ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు. అయితే అరెస్టు నుంచి రిమాండ్‌కు తరలించే వరకూ బన్నీ వెంటే ఆయన తండ్రి అల్లు అరవింద్ ఉన్నారు. కుమారుడిని అరెస్టు చేయడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కన్న కొడుకు కోసం పోలీస్ స్టేషన్, న్యాయస్థానం చుట్టూ పరుగులు పెట్టారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో హైకోర్టులో ఊరట లభిస్తుందని ఆయన ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అల్లు అర్జున్‌ను చంచల్ గూడ జైలుకు తరలిస్తుండడంతో అల్లు అరవింద్, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

Updated at - Dec 13 , 2024 | 05:27 PM