జీహెచ్ఎంసీలో మరో అవినీతి తిమింగలం..
ABN, Publish Date - Aug 06 , 2024 | 08:57 AM
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, మున్సిపల్ కార్పొరేషన్‌లో మరో అవినీతి తిమింగలం బయటపడింది. జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో ఫాగింగ్ చేయకుండానే సీనియర్ ఎంటమాలజిస్ట్ బిల్లులు డ్రా చేశారు. ఈ అధికారి ఓ ఐఏఎస్ అధికారి అండతో రెచ్చిపోతున్నట్లు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, మున్సిపల్ కార్పొరేషన్‌లో మరో అవినీతి తిమింగలం బయటపడింది. జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో ఫాగింగ్ చేయకుండానే సీనియర్ ఎంటమాలజిస్ట్ బిల్లులు డ్రా చేశారు. ఈ అధికారి ఓ ఐఏఎస్ అధికారి అండతో రెచ్చిపోతున్నట్లు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సీనియర్ ఎంటమాలజిస్ట్ అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయినట్లు సమాచారం. మరోవైపు కింది స్థాయి సిబ్బందిపై బెదిరింపులకు దిగినట్లు తెలియవచ్చింది. దీనికి సంబంధించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతిలో కీలక ఆధారాలు ఉన్నాయి.
జీహెచ్ఎంసీలో ఓ అధికారి దందాకు తెరలేపారు. సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్య ఫాగింగ్ చేయకుండానే బిల్లులు డ్రా చేస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారిణి పేరు చెప్పుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. జీహెచ్ఎంసీలో ఫాగింగ్ చేయకుండానే డీజిల్‌ని దుర్వినియోగం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పలువురు ఉన్నతాధికారుల పేర్లు చెప్పి దర్జాగా అక్రమాలకు పాల్పడుతున్నారు. దోమల నివారణ మిషన్ల కొనుగోల్లో కూడా తప్పుడు పత్రాలు పెట్టి బిల్లులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఫాగింగ్ చేయకపోయినా.. ఫాగింగ్ చేసినట్లు బిల్లులు డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా సంధ్యాపై అనేక ఆరోపనలు వచ్చినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ నేతలకు వణుకుపుట్టిస్తున్న మంత్రి..
అమెరికాను వణికిస్తున్న మాంద్యం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 06 , 2024 | 08:57 AM