విశాఖ శారదా పీఠానికి సర్కార్ షాక్..!

ABN, Publish Date - Oct 19 , 2024 | 08:14 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆత్మబంధువు, విశాఖపట్నం శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి చంద్రబాబు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. గత ప్రభుత్వం విశాఖపట్నంలో సదరు పీఠానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆత్మబంధువు, విశాఖపట్నం శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి చంద్రబాబు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. గత ప్రభుత్వం విశాఖపట్నంలో సదరు పీఠానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అందుకు సంబంధించిన అనుమతులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.


ఈ అనుమతులకు సంబంధించిన రద్దు ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశముందని సమాచారం. విశాఖపట్నంలో శారదా పీఠానికి 15 ఎకరాలను కేటాయిస్తూ గత జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్థలం విలువ వందల కోట్ల రూపాయిలు ఉంటుందని గతంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నాటి జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర ఆరోపణలు సైతం వ్యక్తమైన్నాయి.


ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, అవినీతి, అక్రమాలపై కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. అందులోభాగంగా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రద్దు చేసింది. అందులోభాగంగా శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి కేటాయించిన స్థలానికి ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 19 , 2024 | 08:15 PM