ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ABN, Publish Date - Aug 10 , 2024 | 08:33 AM

అమరావతి: పంద్రాగస్టు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య వేడుకల నిర్వహణకు మైనర్, మేజర్ పంచాయతీలకు భారీ స్థాయిలో నిధులు విడుదల చేసింది. మైనర్ పంచాయతీకి రూ. 10 వేలు, మేజర్ పంచాయతీలకు రూ. 25వేలు కేటాయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

అమరావతి: పంద్రాగస్టు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (AP Govt.,) కీలక నిర్ణయం (Key Decision) తీసుకుంది. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు మైనర్, మేజర్ పంచాయతీలకు (Minor, Major Panchayats) భారీ స్థాయిలో నిధులు (Fundsw) విడుదల చేసింది. మైనర్ పంచాయతీకి రూ. 10 వేలు, మేజర్ పంచాయతీలకు రూ. 25వేలు కేటాయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఓ ప్రకటన విడుదల చేశారు. పంచాయతీల ఆధ్వర్యంలో ఆగస్టు 15, (August 15th) జనవరి 26 నాటి (January 26th) కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కూడా మార్గదర్శకాలను ఆయన నిర్దేశించారు. స్వాతంత్య్ర గణతంత్ర దినోత్సవాల విశిష్టత ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహణ ఉండాలన్నారు. విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగ విలువలు తెలిసేలా వేడుకలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీ, అమిత్ షాతో మందకృష్ణ భేటీ..

తెలంగాణకు భారీగా పెట్టుబడులు..

జగన్ మారలేదు.. మేమే మారిపోతాం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 10 , 2024 | 08:33 AM