అరికెపూడి గాంధీ.. కౌశిక్ రెడ్డికి సవాల్..

ABN, Publish Date - Sep 12 , 2024 | 10:24 AM

హైదరాబాద్: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు. గాంధీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం అంటూ పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన గాంధీ మాట్లాడుతూ..

హైదరాబాద్: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు. గాంధీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం అంటూ పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన గాంధీ మాట్లాడుతూ.. ‘‘నువ్వు 11 గంటలకు వస్తానన్నావు రాకుంటే నేను నీ ఇంటికి 12 గంటలకు వస్తా ... నా ఇంటి వద్ద పోలీసు బందోబస్తు అవసరం లేదు.. నీ దమ్ము ఏంటో మా దమ్ము ఏంటో తేల్చుకుందాం’’ అంటూ అరికెపూడి గాంధీ సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరి ఆ పార్టీని భ్రష్టు పట్టించారని, కాంగ్రెస్ నుంచి కొంతమందిని తీసుకువచ్చి బీఆర్ఎస్‌లో చేరుస్తానని చెప్పిన బ్రోకర్‌వని దుయ్యబట్టారు. ఇది బీఆర్ఎస్‌కు తనకు జరుగుతున్న యుద్ధం కాదని, కౌశిక్ రెడ్డికి తనకు జరుగుతున్న యుద్ధమని.. తేల్చుకుందాం రావాలంటూ గాంధీ మరోసారి కౌశిక్ రెడ్డికి సవాల్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ సైలెంట్ ఆపరేషన్..

అబద్ధాలతో పుట్టి.. ఫేక్‌తో పెరిగి..

గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక

ఏపీలో కొత్త మద్యం పాలసీ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 12 , 2024 | 10:24 AM