బీఫ్ వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN, Publish Date - Dec 05 , 2024 | 07:04 AM
బీఫ్ వినియోగంపై అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో దేవాలయాల సమీపంలో బీఫ్ మాంసం విక్రయాలు.. వినియోగాలను ఆ ప్రభుత్వం నిషేధించింది. తాజాగా ఆ నిషేధాన్ని మరింత విస్తరిస్తు్న్నట్లు ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ప్రకటించారు.
బీఫ్ వినియోగంపై అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో దేవాలయాల సమీపంలో బీఫ్ మాంసం విక్రయాలు.. వినియోగాలను ఆ ప్రభుత్వం నిషేధించింది. తాజాగా ఆ నిషేధాన్ని మరింత విస్తరిస్తు్న్నట్లు ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ప్రకటించారు. అసోంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ మాంసం విక్రయించడాన్ని, వినియోగించడాన్ని కూడా నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని సీఎం హిమాంత బిశ్వశర్మ తెలిపారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. అస్సాంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం వడ్డించడం, తినడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినట్లు ముఖ్యమంత్రి బుధవారం ప్రకటించారు. గతంలో దేవాలయానికి ఐదు కిలోమీటర్ల మేర బీఫ్ విక్రయాలను నిషేధించింది. తాజాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆదేశాలను జారీ చేసింది. 2021 పశు సంరక్షణ చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 05 , 2024 | 07:04 AM