మంత్రి ఫరూక్ కుమారుడిపై దాడి..

ABN, Publish Date - Sep 16 , 2024 | 10:08 AM

కర్నూలు జిల్లా: నంద్యాలలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కుమారుడు.. టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్‌పై దాడి జరిగింది. కారులో వస్తుండగా నలుగురు యువకులు కారు అద్దాలు పగలగొట్టారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఫిరోజ్ కారు దిగి దుండగులను పట్టుకునేందుకు యత్నించారు.

కర్నూలు జిల్లా: నంద్యాలలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కుమారుడు.. టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్‌పై దాడి జరిగింది. కారులో వస్తుండగా నలుగురు యువకులు కారు అద్దాలు పగలగొట్టారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఫిరోజ్ కారు దిగి దుండగులను పట్టుకునేందుకు యత్నించారు. ముగ్గురు పరారవ్వగా మణికంఠ రెడ్డి అనే వ్యక్తిని ఫిరోజ్‌తోపాటు అతని అనుచరులు పట్టుకున్నారు.


మంత్రి కుమారుడు ఫిరోజ్ ఆదివారం రాత్రి టీడీపీ కార్యాలయం నుంచి వస్తుండగా గుర్తు తెలియని నలుగురు దుండగులు ఫిరోజ్ వస్తున్న కారును అడ్డగించి దాడి చేయడానికి యత్నించారు. అయితే కారులో ఉన్న టీడీపీ కార్యకర్తలు అప్రమత్తమై వెంటనే కారు దిగి దుండగులను పట్టుకునేందుకు యత్నించారు. ముగ్గురు పారిపోగా ఒక వ్యక్తి పట్టుపడ్డాడు. సమాచారం అందుకున్న నంద్యాల వన్ టౌన్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కుమారుడిపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated at - Sep 16 , 2024 | 10:08 AM