ఎందుకు రాజీనామా చేశానంటే..: అవంతి శ్రీనివాస్
ABN, Publish Date - Dec 12 , 2024 | 11:32 AM
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఎస్పార్‌సీపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో రెండున్నరేళ్లు మంత్రిగా పని చేశారు.
విశాఖ: ఎన్నికల ముందు ఏ రాజకీయ నేత అయినా ప్రజలకు అనుగుణంగా పనిచేస్తామని చేబుతారని.. ప్రజలు కూడా నమ్ముతారని.. తీరా గెలిచి సీఎం సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షలను మరిచిపోయి.. వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం మొదలుపెడతారని.. దానివాల్లే ఫలితాలు తారుమారు అవుతాయని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందన్న ఆలోచన చేసుకుని ముందుకు వెళతారని.. అయితే వైఎస్సార్‌సీపీలో అది జరగలేదు కాబట్టే తాను పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నానని అవంతి శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రేమ కోసం మతం మార్చుకున్నా.. అయినా..
ప్రపంచ రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్
‘స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్’...
కొల్లు రవీంద్ర సోదరుని మృతికి సీఎం చంద్రబాబు సంతాపం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 12 , 2024 | 11:32 AM