షేక్ హసీనా అప్పగింత విషయంలో ...

ABN, Publish Date - Dec 31 , 2024 | 01:58 PM

షేక్ హసీనాను తిరిగి పంపకూడదన్న రాజకీయ నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సలహాదారు మీడియా సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత విషయంలో...

ABN Internet: షేక్ హసీనాను తిరిగి పంపకూడదన్న రాజకీయ నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సలహాదారు మీడియా సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత విషయంలో అధికారికంగా భారత్ ప్రతిస్పందించకముందే పొరుగుదేశం పాలకులు ఇలా హడావుడి నిర్దారణ చేయడం సరికాదు. హసీనాను తమకు అప్పగించాలని ఢాకా ఇటీవల దౌత్య ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి సందేశం పంపింది. ఆ విషయాన్ని భారత విదేశాంగశాఖ ధృవీకరించింది తప్ప.. దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ అభ్యర్థించిన స్వల్ప కాలంలోనే సమాధానాన్ని కూడా ఎదుటిపక్షంవారే ఇలా సిద్ధం చేసుకుంటున్నారు.


హసీనా అప్పగింతకు భారత్ అంగీకరించకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నప్పటికీ అభ్యర్థన ప్రక్రియ అన్ని దశలు పూర్తయ్యేవరకు ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. దేశం విడిచి వెళ్లిపోయేందుకు హసీనాను మిలట్రీ అనుమతించినప్పటికీ ఆమె మీద కేసులు ఏమీ లేవు. అప్పుడు అందరికీ కావాల్సింది ఆమె ఉన్న ఫలంగా నిష్క్రమించడమే. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై కేసులు పెట్టింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

అరెస్టు భయంతో పరారీలో పేర్నినాని..

యలమందలలో సీఎం చంద్రబాబు ఫెన్షన్ల పంపిణీ..

ఏపీ మహిళలకు సర్కార్ గుడ్‌న్యూస్‌..

పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు

నూతన సంవత్సర వేడుకల జోష్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 31 , 2024 | 01:59 PM