రాష్ట్రాల ఆమోదం అక్కర్లే: పీఎం మోదీ

ABN, Publish Date - Sep 30 , 2024 | 10:21 AM

లోక్ సభ, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల పదవీ కాలాన్ని ఒకేసారి ముగించేందుకు 82ఏలోని సబ్ క్లాజ్‌2 జోడిస్తారు. ఇక లోక్ సభ పదవీకాలం రద్దుకు సంబంధించి83 (టూ) అధికరణను సవవరించి కొత్తగా సబ్ క్లాజ్ 3, 4 లను చేరుస్తారు. రాష్ట్రాల అసెంబ్లీల రద్దు నిబంధనలు కూడా ఇందులో ఉంటాయి.

న్యూఢిల్లీ: లోక్ సభలో బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోయినా ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’పై మోదీ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జమిలీ ఎన్నికలను సాకారం చేసేందుకు పార్లమెంట్‌లో మూడు బిల్లులను ప్రవేశపెట్టాలని సంకల్పించింది. వాటిలో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారధ్యంలో అత్యున్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను కేంద్రమంత్రి ఇటీవల ఆమోదించింది. ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం అపాయింటెడ్ డే ప్రభుత్వం ప్రారంభం అయ్యే రోజుకు సంబంధించి 82ఏ అధికారంలో కొత్తగా సబ్‌క్లాజ్1 చేరుస్తారు.


లోక్ సభ, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల పదవీ కాలాన్ని ఒకేసారి ముగించేందుకు 82ఏలోని సబ్ క్లాజ్‌2 జోడిస్తారు. ఇక లోక్ సభ పదవీకాలం రద్దుకు సంబంధించి 83 (టూ) అధికరణను సవవరించి కొత్తగా సబ్ క్లాజ్ 3, 4 లను చేరుస్తారు. రాష్ట్రాల అసెంబ్లీల రద్దు నిబంధనలు కూడా ఇందులో ఉంటాయి. 327 అధీకరణను సవరించి సమాంతర ఎన్నికలు అనే పదబంధాన్ని జోడిస్తారు. ఏ బిల్లుకు కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం లేదని కోదండ కమిటీ సిఫార్స్ చేసింది. దీనిని కేబినెట్ ఆమోదించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీ ‘రైతు హామీల సాధన దీక్ష’ నేడు

అందరికీ వరదసాయం అందాకే ఆ కార్యక్రమం

నువ్వు అవినీతిపరుడివి.. నువ్వే నిందితుడివి!

బాబోయ్.. 100కిపై మొసళ్లను చంపేసిన రైతు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 30 , 2024 | 10:21 AM