Tirupati: నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపులు..
ABN, Publish Date - Oct 25 , 2024 | 10:38 AM
తిరుపతిలో స్టార్ ఎయిర్ లైన్స్ విమానానికి సయితం బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే పోలీసుల తనిఖీల్లో బాంబులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా బాంబు బెదిరింపులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లా: తిరుపతిలో నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపాయి. అర్ధరాత్రి మెయిల్స్ రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. హోటళ్లలోని ప్రతి రూమ్‌లను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. మరోవైపు కర్ణాటక నుంచి వచ్చే స్టార్ ఎయిర్ లైన్స్ విమానానికి సయితం బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే పోలీసుల తనిఖీల్లో బాంబులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా బాంబు బెదిరింపులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు మెయిల్లో బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రత్యేక బృందాలు, బాంబ్ స్వ్కాడ్, డాగ్స్‌తో తనిఖీలు చేశారు. తమిళనాడులో టెర్రరిస్ట్ జాఫర్ సాదిక్‌కు జైలు శిక్ష ఖరారు కావడంతో మెయిల్లో ఆక్రోశం వెళ్లబుచ్చారు. శిక్ష పడేందుకు తమిళ సర్కార్ తరఫున సీఎం స్టాలిన్ సహకారం అందించడం తమకు నచ్చలేదని మెయిల్లో సందేశం పంపారు. అలాగే తమిళనాడులోని పాఠశాలల్లో పేలుళ్లకు ఐఎస్ఐ పిలుపునిచ్చినట్టు మెయిల్ సందేశం.. అలాగే సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం తిరుపతిలో పలు హోటళ్లను కూడా పేల్చేస్తామని మెయిల్లో బెదిరింపులకు పాల్పడ్డారు.
కాగా ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ అన్నీ చెన్నై నుంచి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం దేశ వ్యాప్తంగా ఇటువంటి బెదిరింపు మెయిల్స్ వచ్చి కలకలం రేపాయి. అదే విదంగా తిరుపతిలో కూడా హోటళ్లకు బాంబే బెదిరింపులు వచ్చాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రామయ్యను దర్శించుకున్న గవర్నర్
తీరం దాటిన ‘దాన’ తీవ్ర తుఫాన్..
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Oct 25 , 2024 | 11:19 AM