జైల్లో బొరుగడ్డ కోరిక.. ఏంటంటే..
ABN, Publish Date - Oct 30 , 2024 | 01:00 PM
గుంటూరు: పోలీస్ కస్టడీలో ఉన్న వైసీపీ సానుభూతి పరుడు, రౌడీ షీటర్ బోరుగడ్డ అని కుమార్ వింత కోరికలు కోరుతున్నాడు. తనకు బిర్యానీ తినాలని ఉందని, బయట హోటల్ నుంచి తెప్పించాలని.. లేదా ఇంటి నుంచి అయినా ఆహారం తెప్పించాలని పోలీసులను డిమాండ్ చేశాడు. అయితే...
గుంటూరు: పోలీస్ కస్టడీలో ఉన్న వైసీపీ సానుభూతి పరుడు, రౌడీ షీటర్ బోరుగడ్డ అని కుమార్ వింత కోరికలు కోరుతున్నాడు. తనకు బిర్యానీ తినాలని ఉందని, బయట హోటల్ నుంచి తెప్పించాలని.. లేదా ఇంటి నుంచి అయినా ఆహారం తెప్పించాలని పోలీసులను డిమాండ్ చేశాడు. అయితే బోరుగడ్డ డిమాండ్‌ను పోలీసులు సున్నితంగా తిరస్కరించారు. సాధారణ నిందితులకు తెప్పించే విధంగానే మెస్ నుంచి భోజనం తెప్పించారు. బోరుగడ్డను కోర్టులో హాజరు పరిచిన నేపథ్యంలో బిర్యానీ వ్యవహారంపై జడ్జికి ఫిర్యాడు చేశాడు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ తాము తినేది అదే భోజనం అని చెప్పడంతో బోరుగడ్డ అనిల్ సైలెంట్ అయ్యాడు.
బోరుగడ్డ అనిల్‌ను కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించడంతో ఆది, సోమవారాల్లో అరండల్‌పేట పోటీస్ స్టేషన్‌లో పోలీసులు విచారించారు. కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మంగళవారం గుంటూరులోని జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం, ఆయనను ఐదవ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా న్యాయాధికారి మళ్లీ రిమాండ్ విధించడంతో అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చిక్కుల్లో పీవీ సింధు.. అనుకోని కష్టం..
సీఎం జగనే ఇసుక వ్యాపారం చేశారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
‘రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్’
కేసులతో ఇబ్బందులకు గురిచేసే కుట్రలు..
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Oct 30 , 2024 | 01:05 PM