కలెక్టర్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు..

ABN, Publish Date - Nov 12 , 2024 | 01:44 PM

వికారాబాద్ అధికారులపై దాడి జరిగిన ఘటనలో విచారణ కొనసాగుతోంది. పట్నం నరేందర్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి జరిగిన కొన్ని గంటలకు ముందే పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ దాదాపు 42 సార్లు మాట్లాడినట్లు గుర్తించారు.

వికారాబాద్: జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారులపై దాడి చేసేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కుట్ర చేసిన వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు సురేష్‌గా గుర్తించారు. ఘటనకు ముందు పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ మాట్లాడినట్లు తేల్చారు. కాగా వికారాబాద్ అధికారులపై దాడి జరిగిన ఘటనలో విచారణ కొనసాగుతోంది. పట్నం నరేందర్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి జరిగిన కొన్ని గంటలకు ముందే పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ దాదాపు 42 సార్లు మాట్లాడినట్లు గుర్తించారు. సురేష్‌తో మాట్లాడుతూ ఆరు సార్లు కేటీఆర్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడినట్లు పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.


పక్కా ప్రణాళికతో అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ సంఘటన ప్రదేశానికి వెళ్లి విచారణ జరిపే అవకాశముంది. ఇప్పటికే వికారాబాద్ జిల్లా ఎస్పీ విచారణ చేసి దాడిలో ఉన్నవారిని గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో సురేష్ అనే వ్యక్తి ప్రధాననిందితుడిగా పోలీసులు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్సార్సీపీ నేత కేతిరెడ్డికి నోటీసులు..

జగన్ బెయిల్ రద్దు విచారణ వాయిదా..

రీ సర్వే డ్రోన్లు ఢమాల్.. రూ. 200 కోట్లు వృథా చేసిన జగన్

లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలి: హరీష్‌రావు

పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 12 , 2024 | 01:44 PM