మదనపల్లి ఘటన.. వెలుగులోకి కీలక అంశాలు ..
ABN, Publish Date - Nov 15 , 2024 | 09:08 AM
మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసుకు పథకం ప్రకారమే నిప్పు పెట్టారని రెవెన్యూ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మనుషులు భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారని, ఇందుకు రెవెన్యూ అధికారులు సహకరించారని తేల్చింది. ఈ అక్రమాలను సమాధి చేసేందుకే ఆఫీసుకు నిప్పు పెట్టారని విచారణలో గుర్తించింది.
మదనపల్లి మాజీ ఆర్టీవో మురళీ, ఆర్టీవో హరిప్రసాద్ అవినీతిలో మునిగిపోయారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మనుషులకు అడ్డగోలుగా భూములను ఫ్రీ హోల్డ్ చేశారు. అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు పక్కా పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. పెద్దిరెడ్డి పీఏ తుకారం, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్ది, మాజీ ఆర్టీవో ముురళీ ఆదేశాల మేరకు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ అమలు చేశారని రెవెన్యూశాఖ తేల్చింది.
మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసుకు పథకం ప్రకారమే నిప్పు పెట్టారని రెవెన్యూ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మనుషులు భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారని, ఇందుకు రెవెన్యూ అధికారులు సహకరించారని తేల్చింది. ఈ అక్రమాలను సమాధి చేసేందుకే ఆఫీసుకు నిప్పు పెట్టారని విచారణలో గుర్తించింది. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం కేసులో రెవెన్యూ శాఖ పలు అభియోగాలు నమోదు చేసింది. మదనపల్లె మాజీ ఆర్డీవో ఎస్.మురళి, ఆర్డీవో సి.హరిప్రసాద్ (ఘటన జరిగినపుడు), సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌పై తీవ్ర అభియోగాలు మోపింది. వాటిపై పది రోజుల్లోగా లిఖిత పూర్వక సమాధానం (డిఫెన్స్ స్టేట్‌మెంట్) ఇవ్వాలని ఆదేశిస్తూ గురువారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను పరిశీలిస్తే మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో ఎవరి పాత్ర ఏమిటి? తెరవెనక ఏం జరిగిందన్నది సిసోడియా స్పష్టంగా బయటపెట్టారు.
Updated at - Nov 15 , 2024 | 09:08 AM