చంద్రబాబు పథకాలు దేశానికే ఆదర్శం

ABN, Publish Date - Sep 01 , 2024 | 08:36 AM

అమరావతి: ఉత్తమ సుపరిపాలన అనే పదం మొట్టమొదటిసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినబడిందంటే అతిశయోక్తికాదు. పరిపాలనను ఉత్తమంగా తీర్చిదిద్దడం కోసం ముందుగా పాలనను కంప్యూటకరించి సేవల్లో వేగం, పారదర్శకత తెచ్చారు.

అమరావతి: ఉత్తమ సుపరిపాలన అనే పదం మొట్టమొదటిసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినబడిందంటే అతిశయోక్తికాదు. పరిపాలనను ఉత్తమంగా తీర్చిదిద్దడం కోసం ముందుగా పాలనను కంప్యూటకరించి సేవల్లో వేగం, పారదర్శకత తెచ్చారు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.


అసాధారణ పోరాటయోధుడు.. అనేక ఎన్నికల యుద్ధాల్లో ఆరితేరిన వీరుడు.. నిరంతర శ్రామికుడు..అలుపెరుగని నాయకుడు.. పడిన ప్రతిసారి ఉవ్వెత్తున ఎగిసే కెరటం. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం. సంక్షోభాలు, సంఘర్షణలు, పోరాటాలు, విజయాల సమ్మేళనం. 2024 ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి.. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దార్శనికుడు. కేంద్రప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న రాజకీయ దురందురుడు. ఆయనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.


చంద్రబాబు ది లీడర్.. ప్రజా సమస్యలను పరిష్కరించడం.. ప్రజల అవసారలను అందరికంటే ముందుగా గుర్తించి అందుకు అనుగుణమైన పథకాలు, విధానాలను రూపొందించడంవలనే నారా చంద్రబాబు నాయుడు ఓ గొప్ప విజన్‌రీగా గుర్తింపు పొందారు. ఆయన 45 ఏళ్ల ప్రస్తానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం. విద్యార్థి దశలోనే విశిష్ట నాయకత్వ లక్షణాలను ప్రదర్శించిన చంద్రబాబు.. తాను పుట్టిన గ్రామం.. చుట్టుప్రక్కల ప్రాంతాలలో సహచరులతో కలిసి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నాడు అందరి దృష్టిని ఆకర్షించాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంతకంటే నీతిమాలిన చర్య ఉంటుందా ..

వరంగల్ జిల్లాలో వర్షాలు..

ఈ నెలంతా వానలు?

వణికించిన చినుకు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 01 , 2024 | 08:36 AM