ఏజెన్సీ అభివృద్ధిపై సీఎం ఫోకస్..

ABN, Publish Date - Nov 01 , 2024 | 01:04 PM

అమరావతి: వైసీపీ పాలనలో ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కేంద్రం ఇచ్చే నిధులను సయితం మళ్లించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏజెన్సీ అభివృద్ధిపై దృష్టిపెట్టడంతోపాటుగా కేంద్రం ఇచ్చే నిధులను పెంచేలా చేయడంతో ఏజెన్సీలో అభివృద్ది పరుగులు తీయడం ఖాయంగా కనిపిస్తోంది.

అమరావతి: వైసీపీ పాలనలో ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కేంద్రం ఇచ్చే నిధులను సయితం మళ్లించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏజెన్సీ అభివృద్ధిపై దృష్టిపెట్టడంతోపాటుగా కేంద్రం ఇచ్చే నిధులను పెంచేలా చేయడంతో ఏజెన్సీలో అభివృద్ది పరుగులు తీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 275(1) కింద నిధులు విడుదల చేస్తారు. వాటిని ఏజెన్సీ ప్రాంతాల్లో వివిధ మౌలిక వసతులతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. వైసీపీ హయాంలో కూడా మొదటి రెండేళ్లు ఇదే విధంగా నిధులు విడుదల చేశారు. అయితే ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించడంతో కేంద్రం తదుపరి నిధులు విడుదల చేయలేదు. కేంద్రం నిధులు ఆగిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి జరగని పరిస్థితి ఏర్పడింది.


ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో గిరిజనులకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఇటీవల కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ప్రాజెక్టు అప్రైజల్ కమిటీ, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ అధికారులతో సమావేశమై రూ. 154 కోట్ల మేర నిధులు మంజూరుకు అంగీకరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం..

హోంమంత్రి అనిత నివాసంలో దీపావళి సంబరాలు

సీఎం రేవంత్ రెడ్డిని వదిలి పెట్టను: కేటీఆర్

ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: సీఎం సిద్ధరామయ్య

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 01 , 2024 | 01:04 PM