ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్

ABN, Publish Date - Jul 23 , 2024 | 09:06 AM

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ ప్రతీకారాలు, కక్ష సాధింపు చర్యలు, ఇసుక వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని సీఎం స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజకీయ ప్రతీకారాలు మంచిది కాదని తన, మన అనే భేదం చూడకుండా ఎంతటి వారినైనా అణచివేస్తామని హెచ్చరించారు.

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ ప్రతీకారాలు, కక్ష సాధింపు చర్యలు, ఇసుక వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని సీఎం స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజకీయ ప్రతీకారాలు మంచిది కాదని తన, మన అనే భేదం చూడకుండా ఎంతటి వారినైనా అణచివేస్తామని హెచ్చరించారు. చేయని నేరానికి 53 రోజులు జైల్లో ఉన్న తాను.. కక్ష్యలు, కార్పణ్యాలకు దిగనని, వాటిజోలుకు వెళ్లనని స్పష్టం చేశారు. ప్రజలు కూటమిని గెలిపించింది.. వాటి కోసం కాదని హితవుపలికారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు తాము పూర్తి మద్దతు ఇస్తామని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ ప్రకటించారు.


ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం పూర్తి అయిన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో కూటమి పక్షాల శాసనసభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్, బీజేపీ నేత మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. పారదర్శకంగా ప్రజలకు మరింత చౌవకగా ఇసుక ఉచితంగా ఇచ్చేలా సలహాలు, సూచనలు ఉంటే చెప్పాలని శాసనసభ్యులను చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. తూ.గో. జిల్లాలో ఇసుకు ఎక్కువ రేటు పలుకుతోందని కూటమి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా ఏముందని ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దేశంలో భారీగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం

ఏపీలో రెండు షాకింగ్ ఘటనలు..

పోలవరానికి 12,157 కోట్లివ్వండి

ఐదేళ్లుగా అశాంతి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 23 , 2024 | 09:22 AM