వెనక్కి తగ్గొద్దు ఎవరైనాసరే కూల్చేయండి ..

ABN, Publish Date - Sep 05 , 2024 | 09:58 AM

హైదరాబాద్: చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అక్రమకట్టడాలు తొలగింపునకు ఇప్పటివరకు వివిధ శాఖల పరిధిలో ఉన్న అధికారాలన్నింటిని హైడ్రా పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

హైదరాబాద్: చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అక్రమకట్టడాలు తొలగింపునకు ఇప్పటివరకు వివిధ శాఖల పరిధిలో ఉన్న అధికారాలన్నింటిని హైడ్రా పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రెవెన్యూ, నీటిపారుదల, జీహెచ్ఎంసీ, హెఎండీఏ, పంచాయతీరాజ్, రోడ్డు భవనాల శాఖ.. ఇలా సంబంధిత శాఖలన్నింటినుంచి హైడ్రా విధి నిర్వహణకు అవసరమైన అధికారాలను హైడ్రాకు బదలాయించనున్నారు.


ఇటీవల దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న భవనాల తొలగింపునకు సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక నుంచి నోటీసులిచ్చే అధికారాన్ని కూడా రెవెన్యూ నుంచి హైడ్రాకు బదలాయించనున్నారు. కాగా, జీహెచ్‌ఎంసీ, పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో ఉండే అధికారాలనూ హైడ్రాకు బదలాయించాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఆ శాఖలను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైడ్రాకు అధికారాలను కట్టబెట్టే విషయంపై ఇటీవల సీఎస్‌ శాంతికుమారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్రమ కట్టడాలు, ఆక్రమణల తొలగింపు విషయంలో, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విషయంపై ఆగస్టు 29న ఈ సమీక్ష జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో భారీ వర్షాలు.. అధికారుల హెచ్చరిక..

వరద బాధితులకు అండగా ABN

మళ్లీ రాత్రి నుంచి కురుస్తున్న వర్షం..

బుడమేరు గండ్లు పూడిక పనులు.. పరిశీలిస్తున్న మంత్రులు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 05 , 2024 | 10:00 AM