ఆయనను విచారించేందుకు ఏసీబీ సిద్ధం
ABN, Publish Date - Nov 13 , 2024 | 11:14 AM
న్యూఢిల్లీ: మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 17ఏ కింద గవర్నర్ అనుమతి కోరామని, ఈ నిబంధన కింద గవర్నర్ అనుమతి ఇచ్చి తీరాలన్నారు. కానీ 15 రోజులుగా గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉందన్నారు.
న్యూఢిల్లీ: మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 17ఏ కింద గవర్నర్ అనుమతి కోరామని, ఈ నిబంధన కింద గవర్నర్ అనుమతి ఇచ్చి తీరాలన్నారు. కానీ 15 రోజులుగా గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉందన్నారు. రెండు రోజుల కిందట కేటీఆర్ ఢిల్లీ వచ్చారని, ఇప్పుడు గవర్నర్‌ను ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అడ్డా’ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ అనుమతి రాకుండా.. ఈ రేస్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దాంతో, బీజేపీ, బీఆర్ఎస్ చీకటి బంధం బయటపడుతుందన్నారు. బీజేపీ అవినీతి పార్టీ అని, దానిని అంతం చేస్తామని కేటీఆర్ అన్నారని, మరి ఇప్పుడు వినతి పత్రాలు పట్టుకుని ఆ పార్టీ నేతలను ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చేసిన అవినీతిపై విచారణ మొదలైందని.. దానికి జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలని అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కీలక సూత్రధారి పట్నం నరేందర్‌రెడ్డి
వారిని సామాజిక కార్యకర్తలనటం సిగ్గుచేటు
గూడ్స్ రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు..
విద్యార్ధినిపై వైఎస్సార్సీపీ సర్పంచ్ అత్యాచార యత్నం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 13 , 2024 | 11:14 AM