నేడే జాబ్ క్యాలెండర్ ప్రకటన..
ABN, Publish Date - Aug 02 , 2024 | 09:23 AM
హైదరాబాద్: జాబ్ క్యాలెండర్‌ను శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించనున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా... దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతియేటా క్యాలెండర్‌ను ప్రకటించేలా ఒక విధానం తీసుకరావాలని క్యాబినేట్ నిర్ణయించింది.
హైదరాబాద్: జాబ్ క్యాలెండర్ (Job Calender)ను శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో (Assembly) ప్రకటించనున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా... దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతియేటా క్యాలెండర్‌ను ప్రకటించేలా ఒక విధానం తీసుకరావాలని క్యాబినేట్ నిర్ణయించింది. శుక్రవారం అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా జాబ్ క్యాలెండర్‌పై ప్రకటన చేయనున్నారు. ఎన్ని ఉద్యోగాలను భర్తీచేస్తారనే వివరాలను కూడా సభలోనే చెప్పనున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన గురువారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రిజిస్ట్రేషన్ శాఖలో జగన్ అక్రమాలు ..
మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 02 , 2024 | 09:23 AM