పుష్ప-2పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..

ABN, Publish Date - Dec 22 , 2024 | 09:03 PM

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) పుష్ప-2 (Pushpa-2) సినిమా బెన్ ఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం సరైంది కాదని సీపీఐ నారాయణ (CPI Narayana) అన్నారు. పుష్ప-2 సమాజానికి ఉపయోగపడే సినిమా కాదని, స్మగ్లింగ్, ఎర్రచందనం అక్రమ రవాణా వంటి వ్యవస్థలను పోత్సహించే విధంగా ఉందని ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) పుష్ప-2 (Pushpa-2) సినిమా బెన్ ఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం సరైంది కాదని సీపీఐ నారాయణ (CPI Narayana) అన్నారు. పుష్ప-2 సమాజానికి ఉపయోగపడే సినిమా కాదని, స్మగ్లింగ్, ఎర్రచందనం అక్రమ రవాణా వంటి వ్యవస్థలను పోత్సహించే విధంగా ఉందని ఆయన మండిపడ్డారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ ఘటనలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందడం బాధాకరమని, ఆమె కుమారుడు శ్రీతేజ్ చావుబతుకుల మధ్య ప్రాణాలతో పోరాడుతున్నారని నారాయణ చెప్పారు. సీపీఐ తరఫున వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, పుష్ప-2పై సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated at - Dec 22 , 2024 | 09:03 PM