తుఫాన్‌గామారనున్న అల్పపీడనం..

ABN, Publish Date - Oct 15 , 2024 | 08:54 AM

విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారానికి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. ఆ తర్వాత రెండ్రోజుల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ అల్పపీడనం బుధవారానికి తుఫాన్‌గా మారుతుందని...

విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారానికి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. ఆ తర్వాత రెండ్రోజుల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ అల్పపీడనం బుధవారానికి తుఫాన్‌గా మారుతుందని... 17వ తేదీకల్లా మరింత బలపడి చెన్నైకు దక్షిణం వైపున తీరం దాటుతుందని, అనంతరం వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రంలో ప్రవేశిస్తుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.


అరేబియా సముద్రంలో ప్రవేశించాక బలపడి తీవ్ర తుఫాన్‌గా మారే క్రమంలో ఈనెల 23న ఒమన్‌లో తీరం దాటుతుందని విశ్లేషించారు. మరో మోడల్‌ ప్రకారం... అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుంది. నంతరం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి 17న దక్షిణ కోస్తాలో తీరం దాటుతుంది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయవ్యంగా పయనించి ఈనెల 16కల్లా వాయుగుండంగా బలపడుతుందని ఇస్రో వాతావరణ నిపుణులు తెలిపారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడి 17 దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటుతుందని, ఆ సమయంలో గాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీస్తాయని పేర్కొన్నారు. దీనికితోడు దక్షిణ కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో బంగాళాఖాతం నుంచి భారీగా తేమగాలులు రావడంతో ఆదివారం రాత్రి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, కోస్తాలో మిగిలినచోట్ల వర్షాలు కురిశాయి.

Updated at - Oct 15 , 2024 | 08:54 AM