చైనాను వణికిస్తున్న బెబింకా తుఫాను..

ABN, Publish Date - Sep 17 , 2024 | 08:38 AM

షాంఘై: చైనాలో బెబింకా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. డ్రాగన్ ఆర్థిక రాజధాని షాంఘైను ఈ తుఫాను అల్లకల్లోలం చేసింది. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా చైనాను బెబింకా వణికిస్తోంది. గంటకు 151 కిలోమీటర్ల వేగంతో తుఫాను విజృంభించింది.

షాంఘై: చైనాలో బెబింకా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. డ్రాగన్ ఆర్థిక రాజధాని షాంఘైను ఈ తుఫాను అల్లకల్లోలం చేసింది. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా చైనాను బెబింకా వణికిస్తోంది. గంటకు 151 కిలోమీటర్ల వేగంతో తుఫాను విజృంభించింది. దీంతో వందల విమానాలు రద్దయ్యాయి. పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. శక్తివంతమైన బెబింకా తుఫాను ధాటికి భీకరమైన గాలులు, భారీ వర్షాలు నగరాన్ని వణికిస్తున్నాయి. 2.5 కోట్ల జనాభా ఉన్న షాంఘై మహా నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. 1949లో టైఫూన్‌ గ్లోరియా తర్వాత షాంఘైను తాకిన అత్యంత బలమైన తుఫాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఇక్కడ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జానీ మాస్టర్ బాధితురాలి స్టేట్మెంట్‌లో సంచలన నిజాలు..

ఢిల్లీ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ..

రాజధాని నిర్మాణాలు సేఫ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 17 , 2024 | 08:38 AM