అప్పుడే చంద్రబాబు విలువ తెలిసింది: పవన్ కల్యాణ్
ABN, Publish Date - Dec 13 , 2024 | 01:39 PM
అమరావతి: కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది.. విడిపోతే ఎంత బలహీనపడతాం.. అనేది తనకు ఈరోజు స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్‌చేస్తున్నప్పుడు తెలిసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తనకు చాలా తృప్తిగా ఉందన్నారు.
అమరావతి: కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది.. విడిపోతే ఎంత బలహీనపడతాం.. అనేది తనకు ఈరోజు స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు తెలిసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తనకు చాలా తృప్తిగా ఉందన్నారు. స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్‌ఆవిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. కోట్ల మంది ప్రజలకు బలం ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడుకు సుదీర్ఘమైన అనుభవం ఉందని, మంచి అడ్మినిస్ట్రేటర్ అని పవన్ కొనియాడారు. తాను పార్టీ పెట్టి నలిగిపోయిన తర్వాత.. చంద్రబాబు విలువేంటో తనకు తెలిసిందని, అందుకే ఆయనపై తనకు అపారమైన గౌరవం పెరిగిందన్నారు. పార్టీ నడపటం అంటే ఆత్మహత్యా సద్రుశ్యంతో సమానమన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే ఇదే సరైన సారధ్యమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
అజ్ఞాతంలో మాజీ మంత్రి పేర్నినాని కుటుంబ సభ్యులు..
ప్రజా సమ్యస్యల మీద పోరాడే ఫార్ములే కేటీఆర్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 13 , 2024 | 01:42 PM