టీవీ రంగంలో మార్పు రావాలి: పవన్

ABN, Publish Date - Dec 30 , 2024 | 12:56 PM

విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నిర్మాత, ఫిలిమ్ కార్పొరేషన్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. జనవరి 4న రాజమండ్రిలో నిర్వహించనున్న గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని ఆహ్వానించారు.

విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నిర్మాత, ఫిలిమ్ కార్పొరేషన్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. జనవరి 4న రాజమండ్రిలో నిర్వహించనున్న గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని ఆహ్వానించారు. సినిమా పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. చిత్రపరిశ్రమ ప్రజలతో మమేకమై ఉంటుందని, విలువలతో కూడిన సినిమాలు, చైతన్యాన్ని ఇచ్చే సినిమాలు అవసరమని అన్నారు. ఒక‌ కధను అనుకుని ముందుకు తీసుకెళ్లడమే సినిమా అని, కమర్షియల్ హంగులతో ఉండే సినిమాలతో పాటు, ప్రజలు గురించి సినిమాలు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. వేల మంది ఆధారపడిన పరిశ్రమ అన్ని విధాలా వృద్ధి చెందాలని, టీవీ రంగంలో కూడా కొంత మార్పు రావాలని వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోషల్ మీడియా పోస్టుల కేసులో పోలీసుల దూకుడు..

మన్మోహన్ సింగ్‌ భారత రత్నకు అర్హులే..: కేటీఆర్

ఇది కక్ష్యా.. శిక్ష్యా.. నిర్లక్ష్యమా..: కేటీఆర్

చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు మరోసారి పెద్దపీఠ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 30 , 2024 | 12:56 PM