మండలిలో పవన్ కళ్యాణ్ మొదటి స్పీచ్..

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:14 PM

రాష్ట్రంలోని పంచాయితీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుపై మండలిలో చర్చ జరిగింది. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానంగా మాట్లాడుతూ.. పంచాయితీల్లో డంపింగ్ యార్డుల నిర్వహణ అవసరాన్ని గుర్తించామని, డంపింగ్ యార్డుల నిర్వహణ అందరి బాధ్యత అని అన్నారు.

అమరావతి: ఏపీ శాసనమండలిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మొదటిసారిగా మాట్లాడారు. రాష్ట్రంలోని పంచాయితీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుపై మండలిలో చర్చ జరిగింది. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానంగా మాట్లాడుతూ.. పంచాయితీల్లో డంపింగ్ యార్డుల నిర్వహణ అవసరాన్ని గుర్తించామని, డంపింగ్ యార్డుల నిర్వహణ అందరి బాధ్యత అని అన్నారు. స్కూల్స్ ఏర్పాటు చేయడానికే సెంటు భూమి లేని పంచాయితీలు ఉన్నాయని, ఈ నేపధ్యంలోనే 10,15 పంచాయితీలు కలిపి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే డంపింగ్ యార్డుల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామన్నారు.


పంచాయతీ భవనాలు, ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి అయిన ఖర్చుపై పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. పంచాయతీల్లో సచివాలయ భవనాలకు రంగులు వేయడానికి రూ. 101 కోట్లు ఖర్చు అయిందని, అందులో రంగులు వేయడానికి రూ. 49 కోట్లు అయ్యాయని, వాటిని తొలిగించి తిరిగి రంగులు వేయడానికి రూ. 52 కోట్లకు పైగా ఖర్చు అయిందని పవన్ కల్యాణ్ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘అందుకే గురుదక్షిణ అని అన్నాం’

పాక్ నౌకను ఛేజ్ చేసిన ఐసీజీ నౌక..

కొన్ని లక్షల మందికి మేలు జరిగింది: ఎమ్మెల్యే కోటం రెడ్డి

విచారణకు రాలేను.. వారం రోజుల గడువు కావాలి: రాంగోపాల్ వర్మ

నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-20 ఉపగ్రహం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 19 , 2024 | 01:14 PM