ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: సీఎం సిద్ధరామయ్య
ABN, Publish Date - Nov 01 , 2024 | 09:52 AM
కర్నాటకలో మహిళల ఉచిత బస్సు ప్రయాణాలపై సమీక్షిస్తామంటూ డిప్యూటీ సీఎం డీకె శివకుమార్ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే సీఎం సిద్ధ రామయ్య స్పందించారు. ఈ పథకంపై పొంతన లేకుండా ఇద్దరూ మాట్లాడడంపై రాజకీయంగా చర్చ వాడి వేడిగా సాగుతోంది.
బెంగళూరు: కర్నాటకలో ఉచిత బస్సు పథకాన్ని (Free Bus Scheme) రద్దు చేయనున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. అలాంటి వేళ ఈ ప్రచారంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ద రామయ్య (CM Siddaramaiah) బెంగళూరులో స్పందించారు. మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేస్తున్నారంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. ఆ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు ఆయన సూచించారు. ఈ ఉచిత బస్సు పథకంలో ఎలాంటి మార్పు లేదని సీఎం సిద్ధ రామయ్య స్పష్టం చేశారు. ఈ పథకంపై పున:సమీక్ష చేసే ఆలోచన సయితం తమ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు.
ఉచిత బస్సు మహిళల ప్రయాణాలపై సమీక్షిస్తామంటూ డిప్యూటీ సీఎం డీకె శివకుమార్ (Deputy CM DK Shivakumar) వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే సీఎం సిద్ధ రామయ్య స్పందించారు. ఈ పథకంపై పొంతన లేకుండా ఇద్దరూ మాట్లాడడంపై రాజకీయంగా చర్చ వాడి వేడిగా సాగుతోంది. కర్నాటకలో మహిళలకు ఉచిత బస్సు పథకం రద్దు చేయనున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం అనేది ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అతి పెద్ద హామీలో ఇదొకటి. అయితే ఇప్పుడు ఉచిత బస్సు పథకంపై డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. పథకాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని సీఎం సిద్ద రామయ్య అనడంతో పథకాన్ని రద్దు చేస్తారన్న ఊహాగానాలు వచ్చాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సక్సెస్
శ్రీకాకుళం జిల్లాలో సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
అట్లాంటాలో నారా లోకేస్ రెడ్ బుక్ ప్రస్తావన..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 01 , 2024 | 09:53 AM