Actress Kasturi: నటి కస్తూరికి రిమాండ్..

ABN, Publish Date - Nov 17 , 2024 | 09:47 PM

తమిళనాడులోని తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం నటి కస్తూరికి ఈనెల 29 వరకూ రిమాండ్ విధించింది. తమిళనాడులోని తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలో ఆమెపై ఆ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి.

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం నటి కస్తూరికి ఈనెల 29 వరకూ రిమాండ్ విధించింది. తమిళనాడులోని తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలో ఆమెపై ఆ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో శనివారం రోజున కస్తూరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కోర్టు రిమాండ్ విధించడంతో ఆమెను సెంట్రల్ జైలుకు తరలించారు.


నవంబర్ 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగువారిపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర రుమారం రేగడంతోపాటు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మధురై కోర్టును ఆమె ఆశ్రయించగా.. న్యాయస్థానం పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలోనే కస్తూరిని హైదరాబాద్‌లో అరెస్టు చేసి నేడు కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం 12 రోజుల పాటు ఆమెకు రిమాండ్‌ విధించింది. పోలీసులు ఆమెను పుళల్‌ కేంద్ర కారాగారానికి తరలించారు.

Updated at - Nov 17 , 2024 | 09:47 PM