జైలు బయట మాజీ సీఎం జగన్ సెల్ఫీలు..

ABN, Publish Date - Sep 11 , 2024 | 01:02 PM

గుంటూరు జిల్లా: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో మాజీ సీఎం జగన్ గుంటూరు జైల్లో ములాఖత్‌ అయ్యారు. అనంతరం ఆయన జైలు బయట మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా పలువురు కార్యర్తలు ఆయనతో సెల్పీలు దిగారు.

గుంటూరు జిల్లా: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో మాజీ సీఎం జగన్ గుంటూరు జైల్లో ములాఖత్‌ అయ్యారు. అనంతరం ఆయన జైలు బయట మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా పలువురు కార్యర్తలు ఆయనతో సెల్పీలు దిగారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గపు పాలన చూడలేదని, డైవర్షన్ పాలిటిక్స్‌ నడుస్తున్నాయని, నందిగం సురేష్‌ను అర్థరాత్రి సమయంలో హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారని విమర్శించారు.


విజయవాడ వరదలను డైవర్ట్‌ చేసేందుకే, నందిగం సురేష్‌, విజయవాడ డిప్యూటీ మేయర్‌ భర్తను అరెస్టు చేశారని జగన్ ఆరోపించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వాస్తవాలు తెలియవా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మూడు నెలల పాలన చాలా దారుణంగా ఉందని, రెడ్‌బుక్ పాలనపై దృష్టిపెట్టారని జగన్‌ విమర్శించారు.

Updated at - Sep 11 , 2024 | 01:02 PM