దేశంలో భారీగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం

ABN, Publish Date - Jul 23 , 2024 | 08:40 AM

న్యూఢిల్లీ: ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం వరకు ఉంటుందని తెలిపింది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని పేర్కొంది.

న్యూఢిల్లీ: ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం వరకు ఉంటుందని తెలిపింది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని పేర్కొంది. 2022లో ఇది 3.8 శాతం ఉండగా.. 2023లో 6.6 శాతానికి, 2024లో 7.5 శాతానికి పెరిగిందని వివరించింది. అంటే గడిచిన రెండేళ్లలో 97 శాతం పెరిగిపోయినట్లు పేర్కొంది. వాతావరణ మార్పులు, వడగాడ్పులు, రుతుపవనాల విస్తరణలో వ్యత్యాసాలు, అకాల వర్షాలు వంటి కారణాలతో ఆహార ధరలు రెట్టింపు అయ్యాయని తెలిపింది.


2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆమె 2023-24 ఆర్థిక సర్వేను విడుదల చేశారు. విద్య, ఆరోగ్యం, ఉద్యోగావకాశాలు, ఆహార ధరల పెరుగుదల, వృద్ధుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు వంటి వివిధ అంశాలపై ఆర్థిక సర్వే సమగ్ర సూచనలు చేశారు. దేశంలో నాణ్యమైన విద్యను అందించాలని.. అందుకు కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో రెండు షాకింగ్ ఘటనలు..

పోలవరానికి 12,157 కోట్లివ్వండి

ఐదేళ్లుగా అశాంతి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 23 , 2024 | 08:40 AM