మహాపాపం జరిగింది: రమణ దీక్షితులు..

ABN, Publish Date - Sep 20 , 2024 | 01:51 PM

తిరుమల స్వామివారి ప్రసాదం విషయంలో మూడ్రోజులుగా జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలచివేస్తున్నాయని శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అన్నారు. మహాపాపం జరిగిందని, అన్నం పెట్టే దేవుడికి రుచి, సుచిగా ఉండే నివేదనలు పెట్టకుండా దారుణంగా వ్యవహరించారని అన్నారు.

తిరుమల: శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు, చేప నూనె వాడిన విషయం నిజమేనని నిర్ధారణ కావడం బాధిస్తోందని శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు(Ramana Dikshitulu) అన్నారు. స్వామివారి ప్రసాదం విషయంలో మూడ్రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను, భక్తులను తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆయన చెప్పారు. మహాపాపం జరిగిందని, అన్నం పెట్టే దేవుడికి రుచి, సుచిగా ఉండే నివేదనలు పెట్టకుండా దారుణంగా వ్యవహరించారని అన్నారు.


నైవేద్యంలో కల్తీ జరగడం బాధాకరమని, స్వామివారికి సరైన రీతిలో నివేదనలు జరగడం లేదని రమణ దీక్షితులు పేర్కొన్నారు. ఇవన్నీ చూసే పాపం మనం చేశామా అనే బాధ కలుగుతోందని ఆయన అన్నారు. గతంలో చాలా సార్లు టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానని, దీనిపై గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లపాటు తిరుమలలో మహాపాపం జరిగిందని, నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలవడం అపచారమని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన జరుగుతోందని రమణ దీక్షితులు చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు..

ఆ ఇద్దరికి త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు..

ఇదేం ఘోరం గోవిందా

తెగిపడుతున్న ఫ్యాను రెక్కలు

Read LatestAP NewsandTelugu News

Read LatestTelangana NewsandNational News

Read LatestChitrajyothy NewsandSports News

Updated at - Sep 20 , 2024 | 01:52 PM