దీపావళికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్..

ABN, Publish Date - Oct 30 , 2024 | 09:57 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP government) ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న మహిళలకు దీపం పథకం (Deepam Scheme) ప్రారంభానికి అన్నీ ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP government) ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న మహిళలకు దీపం పథకం (Deepam Scheme) ప్రారంభానికి అన్నీ ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 1న ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదులాపురం గ్రామంలో సీఎం ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అయ్యే రూ.2,684 కోట్ల ఖర్చుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మెుదటి విడత కింద సిలిండర్లకు ఖర్చయ్యే రూ.894 కోట్లకు సంబంధించిన చెక్కును పెట్రోలియం సంస్థలకు అందించింది. దీపం-2 పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున పేదలకు ఏపీ ప్రభుత్వం అందించనుంది.

Updated at - Oct 30 , 2024 | 09:57 PM