గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడుటలేదు..

ABN, Publish Date - Jun 16 , 2024 | 11:27 AM

గజ్వేల్‌: గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికలైనప్పటి నుంచి కనబడటం లేదని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పాలని, వారికి తగిన బహుమానం ఇస్తామని బీజేపీ నాయకులు గజ్వేల్‌ పట్టణంలో పోస్టర్లు వేశారు.

గజ్వేల్‌: గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికలైనప్పటి నుంచి కనబడటం లేదని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పాలని, వారికి తగిన బహుమానం ఇస్తామని బీజేపీ నాయకులు గజ్వేల్‌ పట్టణంలో పోస్టర్లు వేశారు. తర్వాత పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. ‘కేసీఆర్‌ ఎక్కడున్నా గజ్వేల్‌కు రావాలి’ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్‌ గుర్తులుగా ‘‘తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు లేదా తెల్ల లుంగీ. నెత్తి మీద టోపీ. భయంకరమైన హిందువు. 80వేల పుస్తకాలు చదివిన వ్యక్తి. ఎకరాకు కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి’’ అని పోస్టర్లలో రాసుకొచ్చారు. గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజల పేరిట ఈ పోస్టర్లను ముద్రించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొదటి దశను రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తాం

టీటీడీ అవకతవకలపై సీఎం సీరియస్

దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు..

కేసీఆర్ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 16 , 2024 | 11:27 AM