నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున..

ABN, Publish Date - Oct 08 , 2024 | 07:19 PM

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్‌(Former Minister KTR) కారణమంటూ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే.

హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్‌(Former Minister KTR) కారణమంటూ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తీవ్రంగా ఖండించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టును ఆశ్రయించిన నాగార్జున క్రిమినల్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై ఇవాళ(మంగళవారం) విచారణ జరిగింది. ప్రొసిజర్ ప్రకారం పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. "సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. దేశవ్యాప్తంగా మా కుటుంబం పట్ల ఆధారాభిమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.


నా కుమారుడు విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణం అని మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడం వల్ల మా పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశంతో మంత్రి ఇలాంటి వాఖ్యలు చేశారు. దీని వల్ల మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. ఇలా మంత్రి చేసిన వ్యాఖ్యల వల్ల మా కుటుంబానికి నష్టం జరిగింది. మా కుటుంబం మానసిక క్షోభకు గురైంది’’ అంటూ కోర్టుకు నాగార్జున స్టేట్‌మెంట్ ఇచ్చారు. నాగార్జున స్టేట్‌మెంట్‌ తర్వాత సుప్రియ స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డ్ చేసింది. ఈనెల 10వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది. ఆ రోజు మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు. కోర్టుకు నాగార్జునతోపాటు భార్య అమల, కుమారుడు నాగ చైతన్య, సుప్రియ, అట్ల వెంకటేశ్వర్లు, సుశాంత్ తల్లి, నాగార్జున సోదరి నాగసుశీల హాజరయ్యారు.

Updated at - Oct 08 , 2024 | 07:22 PM