అల్లుడి అరెస్ట్.. మామ భావోద్వేగం ..
ABN, Publish Date - Dec 13 , 2024 | 02:02 PM
హైదరాబాద్: సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ మామయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
హైదరాబాద్: సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ మామయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ఆయనను మాట్లాడవలసిందిగా కోరగా ఆయన నిరాకరిస్తూ.. భావోద్వేగానికి లోనయ్యారు. అయితే పోలీస్ స్టేషన్‌లోకి అల్లు అర్డున్ తండ్రి అల్లు అవింద్‌ను మాత్రమే పోలీసులు లోపలకు అనుమతించారు. మిగిలిన ఎవరీని లోపలకు అనుమతించలేదు. ఇది క్రిమినల్ కేసు, చాలా తీవ్రమైన కేసు కావడంతో పోలీసులు ఇతరులు ఎవరినీ లోపలకు అనుమతించలేదు. కాగా మరికాసేపట్లో అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు పీఎస్‌కు వస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం కోర్టులో ఫిటిషన్ వేయనున్నారు.
అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అకస్మాత్తుగా జరిగిన పరిణామం, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పక్కా ప్లాన్‌తో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా చిక్కడపల్లి పీఎస్ వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పుష్ప -2 రిలీజ్ సందర్భంగా ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. శుక్రవారం పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. అయితే ఇది అరెస్ట్ కాదని, కేవలం విచారణకు మాత్రమే అల్లు అర్జున్ పోలీసులు తీసుకెళ్లారని ఆయన పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి...
ఈ వార్తలు కూడా చదవండి..
అప్పుడే చంద్రబాబు విలువ తెలిసింది: పవన్ కల్యాణ్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
అజ్ఞాతంలో మాజీ మంత్రి పేర్నినాని కుటుంబ సభ్యులు..
ప్రజా సమ్యస్యల మీద పోరాడే ఫార్ములే కేటీఆర్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 13 , 2024 | 02:03 PM